AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో 81 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి..

తెలంగాణలోని 81 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అయితే, ఇంతకు ముందే ప్రభుత్వం 19 మందికి పదోన్నతులు కల్పించింది. తాజాగా మరో 81 మందికి ఇవ్వడంతో మొత్తం 100 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి దక్కింది. చౌటుప్పల్‌ ఆర్డీవోగా కేఎంవీ జగన్నాథరావు, హైదరాబాద్‌లో లా ఆఫీసర్‌గా బీ శకుంతలను నియమించింది. అలాగే తెలంగాణ సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్స్‌గా పని చేస్తున్న ఐదుగురికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమోషన్లు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన టెస్రా అధ్యక్షుడు వంగా రవీందర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ANN TOP 10