ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశంలోనే అతిపెద్ద సరస్సు ‘లాగునా’లో గురువారం ఓ పడవ బినన్‌గొనన్ నుంచి తాలిమ్ ద్వీపానికి బయల్దేరింది. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్‌లో రైజాల్ ప్రావిన్స్‌లో ఓ ప్రయాణికుల పడవ బోల్తాపడిన ఘటనలో దాదాపు 30 మంది దుర్మరణం చెందారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. తుపాను గాలులకు పడవ ఊగిపోవడం, భయంతో ప్రయాణికులంతా ఒకవైపునకు రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉందన్నారు. అయితే, అప్పటికే ఫిలిప్పీన్‌ను ‘డోక్‌సురి’ టైఫున్ కుదిపేస్తోంది.









