AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం.. పెద్ద కుమారుడు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని మూడు రోజుల క్రితం కాంటినెంటల్ హాస్పిటల్‌లో కుటుంబసభ్యులు చేర్పించారు. అప్పటినుంచి వైద్యులు విష్ణువర్దన్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో గురువారం ఉదయం 2:30 నిమిషాలకు విష్ణువర్దన్ రెడ్డి మృతి చెందాడు. అతడి మరణంతో పటాన్‌చెరు నియోజకవర్గవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. విష్ణువర్దన్ రెడ్డి మృతికి పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటిస్తున్నారు. కొడుకు మృతితో బాధలో ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ శ్రేణులు పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.

విష్ణువర్దన్ రెడ్డి నియోజకవర్గంలో తండ్రితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో అతడు చురుగ్గా పాల్గొనేవాడు. ఎన్నికల సమయంలో తండ్రి తరపున ప్రచారం నిర్వహించేవాడు. దీంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ANN TOP 10