AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందరూ చూస్తుండగానే.. వాగులో కొట్టుకుపోయిన తల్లీ కూతుళ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామ పంచాయతీ కుమ్మరపాడులో విషాదం చోటు చేసుకుంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఇద్దరు కూలీలు కొట్టుకుపోయారు. వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుమ్మరపాడుకు చెందిన కొందరు మహిళా వ్యవసాయ కూలీలు పక్కఊర్లో పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వెళ్లే క్రమంలో వారు వాగు దాటాల్సి ఉంది.

వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంటతో దాదాపు 10 మంది కూలీలు ఒకరి చేయి ఒకరు పట్టుకొని జాగ్రత్తగా వాగు దాటే ప్రయత్నం చేసారు. వాగు మధ్యలోకి చేరుకోగానే.. వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో తల్లీ కూతుళ్లు వాగులో కొట్టుకుపోయారు. వాగు పక్కనే ఉన్న స్థానికులు హుటాహుటిన పరుగెత్తి కూతుర్ని రక్షించారు. తల్లి మాత్రం వాగులో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ANN TOP 10