AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సర్ఫ్, షాంపూ ప్యాకెట్ లలో బంగారం దాచుకుని..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా బంగారాన్ని తరలించడానికి చూసిన నిందితుడిని పట్టుకున్నారు. కువైట్ దేశానికి చెందిన ఒక ప్రయాణికుడు రూ. 42 లక్షల విలువైన 704 గ్రాముల బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బంగారాన్ని ఇందులో పెట్టుకుని వచ్చాడంటే.. షాంపూ, బియ్యం, సర్ఫ్ ప్యాకెట్ లలో దాచుకుని తీసుకువచ్చాడు. అయినప్పటికీ ఎయిర్ పోర్ట్ లో అధికారుల కళ్ళను కప్పలేక పట్టుబడ్డాడు. ఇదే రోజున మరో ప్రయాణికుడి దగ్గర నుండి విదేశీ కరెన్సీ ని స్వాధీనం చేసుకున్నారు.

అలాగే మరో ప్రయాణికుడి వద్ద 348 గ్రాముల బంగారం, మరో ఇద్దరి వద్ద 474 గ్రాములు, 496 గ్రాముల బంగారం పట్టుబడింది. మొత్తం 1.558 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్‌ చేశారు. దాని విలువ దాదాపు 93.28 లక్షలు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. కాగా, బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేశామని, నిందితులను నగరంలోని కస్టమ్స్‌ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టామని అధికారులు వెల్లడించారు.

ANN TOP 10