AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూడోసారి అధికారంలోకి వస్తాం.. : ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్య చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు.. అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామన్నది కూడా తాజాగా వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రగతి మైదాన్‌లో కొత్తగా తీర్చిదిద్దిన ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రధాని ప్రారంభించారు. అనంతరం జీ-20 సదస్సుకు వేదికైన ఈ కన్వెన్షన్‌ సెంటర్‌కు భారత్‌ మండపం అని పేరు పెట్టారు. ఈ భారత్‌ మండపం భారతదేశ సత్తాను ప్రపంచానికి తెలియజేస్తుందని.. టూరిజానికి ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలో అభివృద్ధిని ఆపేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని.. ప్రతిపక్షాలను ఉద్దేశించి మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్ బాగా అభివృద్ధి చెందుతోందన్న మోదీ.. 2014 లో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణించే వారి సంఖ్య 5 కోట్లు కాగా.. ప్రస్తుతం అది 7.5 కోట్లకు చేరిందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గెలిచి.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తిగా భారత్‌ ఘనత సాధిస్తుందని తెలిపారు.

ANN TOP 10