AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యార్థులకు ముఖ్య గమనిక.. టైమింగ్స్ మారాయ్.. తక్షణం అమల్లోకి

తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్ల టైమింగ్‌లో మార్పులు చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు తీసుకొచ్చింది. ఉత్తర్వుల ప్రకారం.. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేయనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసినట్టు విద్యా శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది.

జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఈ టైమింగ్స్ పాటించాలని కేసీఆర్ సర్కార్ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ సోమవారం రాత్రే పంపించింది. మరోవైపు.. డీఈవోలు, ఆర్‌జేడీఎస్ఈల పరిధిలోని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల సమయాల్లో చేసిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ANN TOP 10