మంత్రి కేటీఆర్ నేడు తన పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా 24వ తేదీన ప్రెట్టీ అనే ఓ పాటను విడుదల చేయాలని కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు భావించారు. ఇటీవల ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆ పాట కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అనూహ్యంగా ఆదివారం రాత్రి 10.33 గంటలకు హిమాన్షు చేసిన ట్వీట్ పాట కోసం ఎదురుచూస్తున్నవారిని నిరాశపర్చింది. సాంకేతిక కారణాల వల్ల ప్రెట్టీ సాంగ్ విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలిపారు.
మరో తేదీలో పాటను విడుదల చేస్తామని, సాంకేతిక కారణాలు పరిష్కరించిన తర్వాత విడుదల రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తానని హిమాన్షు ట్విట్టర్లో వెల్లడించారు. హిమాన్షు ట్వీట్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు కామెంట్లు పెడుతున్నారు. పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘హ్యాపీ బర్త్ డే కేటీఆర్’ అంటూ మరికొదరు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.