AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అక్టోబర్​లో గ్రూప్-3 పరీక్ష..!

గ్రూప్‌-3 పరీక్ష అక్టోబర్‌ నెలలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ దిశగా కమిషన్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడుసార్లు చర్చించి.. ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే అభిప్రాయానికి కమిషన్‌ వచ్చినట్టు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లో గ్రూప్‌-3 పరీక్ష తేదీలను కమిషన్‌ ప్రకటించనుందట.

రాష్ట్రంలో 105 విభాగాల్లో గ్రూప్‌-3 క్యాటగిరీలో 1,363 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అక్టోబర్‌ నెలలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఐబీపీఎస్‌తోపాటు మిగతా పరీక్షలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రూప్‌-3 పరీక్ష తేదీలను పరిశీలిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారి తెలిపారు.

ANN TOP 10