మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సి. రామచంద్రారెడ్డి గురువారం నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన రామచంద్రా రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మికంగా మరణించారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే గా రెండు సార్లు మంత్రిగా పని చేశారు. మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి ఆకస్మిక మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తారని లోటు అని ఆయన అన్నారు. రామచంద్రారెడ్డి జీవిత కాలం ప్రజా సేవకు అంకితమయ్యారని నిజాయితి, క్రమశిక్షణ తో.రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి రామచంద్రా రెడ్డి గారు అని ఆయన అన్నారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు.
కంది శ్రీనివాసరెడ్డి తీవ్రదిగ్భ్రాంతి
మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన గొప్ప వ్యక్తి అని అన్నారు. సీఆర్ఆర్ మృతిపట్ల కంది శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.










