విద్యాశాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుంటే.. ఇవాళ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించటంపై మండిపడుతున్నారు. అది కూడా పిల్లలు స్కూల్‌కు వెళ్లిన తర్వాత హాలీడే డిక్లేర్ చేయడంపై మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ఇవాళ, రేపు (జులై 20, 21) రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రకటనపై పలువురు నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.









