పాఠశాల విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా రెండ్రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ, రేపు (గురు, శుక్రవారాల్లో) సెలవులు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అన్ని విద్యాసంస్థలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
తిరిగి పాఠశాలలు శనివారం (జులై 22) ప్రారంభమవుతాయని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే పాఠశాలలకు వెళ్లిన స్టూడెంట్స్ తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలకు జులై 22న కూడా సెలవు ఉంటుంది. ఆ తర్వాత జులై 23న ఆదివారం. దీంతో మెుత్తం నాలుగు రోజులు వరుసగా సెలవులు ఉండనున్నాయి. కాగా..హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలకు కూడా వర్క్‌ఫ్రం హోం ఇస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.









