AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాకేమైనా పెట్రోల్‌ ఫ్రీగా వస్తుందా?.. ట్రాఫిక్‌ డీసీపీ ఎక్కడ?

టాలీవుడ్‌ హీరోయిన్ డింపుల్‌ హయతీ సెన్సేషనల్ ట్వీట్
ఈసారి టాలీవుడ్‌ హీరోయిన్ డింపుల్ మరో స్థాయిలో డీసీపీ రాహుల్ హెగ్డే పై సెటైర్లు వేశారు. కురుస్తున్న భారీ వర్షానికి సిటీలో భారీగా ట్రాఫిక్ జాయిన్ అయిందని ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ ఉన్నారని ఆమె ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు తెలంగాణ సీఎంవో కు ట్వీట్ చేశారు. ‘వేర్ ఈజ్‌ ట్రాఫిక్ డీసీసీ’ అంటూ డింపుల్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా కేబుల్‌ బ్రిడ్జిపై నిలిచి ఉన్న వాహనాల ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌ చేసిన డింపుల్‌ ‘ ఇంటికి చేరుకోవాలంటే గంటకు పైగా సమయం పడుతోంది. రోడ్ ల పై ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంటే ట్రాఫిక్ డీసీపీ లు ఎటు పోయారు? ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే పరిస్థితి ఏంటి? ఇళ్లలో నుండి బయటకి రాగలమా ? మాకు పెట్రోల్ ఏమైనా ఫ్రీ గా వస్తుందా ?’ అని రాసుకొచ్చారు. తన పోస్టుకు మంత్రి కేటీఆర్‌, తెలంగాణ సీఎంవోలను కూడా ట్యాగ్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టాలీవుడ్‌ హీరోయిన్ డింపుల్ హయత్ , డీసీసీ రాహుల్ హెగ్డేల మధ్య వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు .. కానీ వివాదం మరో టర్న్ తీసుకుంది. అపార్ట్మెంట్లో పార్కింగ్‌ కు సంబంధించి డింపుల్ హయత్ , డిసిపి రాహుల్ హెగ్డే మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచింది. ఒకరి పైన ఒకరు పోలీస్ స్టేషన్లో పైన ఫిర్యాదు వరకు వెళ్లారు. చివరకు కోర్టు మెట్లు కూడా ఎక్కిన విషయం విదితమే..

ANN TOP 10