కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తలపెట్టిన ‘ఛలో బాట సింగారం’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను ముందుస్తు అరెస్ట్ చేసిన పోలీసులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సైతం అడ్డుకున్నారు. బాట సింగారం వెళ్తున్న కిణషన్ రెడ్డిని అడ్డుకోవడంతో.. ఆయన పోలీసులపై ఫైర్ అయ్యారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను నిలదీశారు.
మరోవైపు ఎక్కడికక్కడా బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానశ్రయం నుంచి నేరుగా ఎమ్మెల్యే రఘునందనరావుతో కలసి కిషన్ రెడ్డి బాట సింగారంకు బయలుదేరారు. అయితే అనుమతి లేనందన కిషన్‌రెడ్డిని తదితరులు పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలెవరూ బాట సింగారం రావొద్దని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల సహా.. బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.









