AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు శుభవార్త.. ఇకపై వైద్య సేవల పరిమితి పెంపు..

ఇక ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. వారికి త్వరలో డిజిటల్‌ కార్డులు సైతం ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన పేదలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో వచ్చిన ఆరోగ్య శ్రీ సేవలు ఎంతో మంది పేదలకు మంచి వైద్యంతో పాటు వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరవాత వైద్యంపై మరింత దృష్టి పెట్టిన కేసీఆర్‌ సర్కార్‌ ఎప్పటికప్పుడు పేదవాడికి అవసరం అయ్యే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్ధిపోందే వారి కోసం వైద్య సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది.

ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు. ఈ ఆరోగ్య శ్రీ సేవల కోసం కొత్తగా డిజిటల్‌ కార్డ్‌ లని ఇవ్వనుంది హెల్త్‌ డిపార్ట్మెంట్‌. దీనికోసం ఈ %సవష% నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచన చేశారు మంత్రి. ఆరోగ్య శ్రీ సేవల లో బయోమెట్రిక్‌ విధానం లో కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఫేస్‌ రికాగ్నైజేషన్‌ విధానం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది వైద్య ఆరోగ్య శాఖ.

ANN TOP 10