AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెళ్ల‌యి ఏడేళ్లు.. సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డంతో.. దంప‌తులిద్ద‌రూ..

మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ మండ‌లంలోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిద్దరూ.. పెళ్ల‌యి ఏడేండ్లు అవుతున్న‌ప్ప‌టికీ సంతానం క‌ల‌గ‌లేదు. భ‌విష్య‌త్‌లో కూడా త‌మ‌కు పిల్ల‌లు పుట్టరేమోనన్న మ‌న‌స్తాపంతో దంప‌తులిద్ద‌రూ పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం హైమద్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. నీరుడి ల‌క్ష్మ‌ణ్‌, రాణి ఏడేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ వీరికి సంతానం క‌ల‌గ‌లేదు. పిల్ల‌లు పుట్టక‌పోవ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. అప్పులు కూడా ఎక్కువ అయ్యాయి. సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డం, అప్పులు అధిక‌మ‌వ‌డంతో మాన‌సికంగా కుంగిపోయారు.

దిక్కుతోచ‌ని స్థితిలో ఈ నెల 8వ తేదీన దంప‌తులిద్ద‌రూ పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. కుటుంబ స‌భ్యులు, బంధువులు వారిని హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాణి నిన్న రాత్రి 8 గంట‌ల‌కు, ల‌క్ష్మ‌ణ్ సోమ‌వారం తెల్ల‌వారుజామున ఐదున్న‌ర గంట‌ల‌కు చ‌నిపోయారు. దీంతో కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు

ANN TOP 10