ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డికి ఉరూరా జనం బ్రహ్మరథం పడుతున్నారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరికలు జోరందుకున్నాయి. గడపగడపకు కాంగ్రెస్.. పల్లె పల్లెకు కంది శ్రీనన్న నినాదంతో చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. కాంగ్రెస్‌లో నయాజోష్ నెలకొంది. అంతేకాదు.. ‘కాంగ్రెస్ డిక్లరేషన్ల’ పై ప్రజలకు వివరిస్తుండటంతో అంతటా ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే జోగురామన్న అవినీతిని ఎండగడుతున్నారు. ఎమ్మెల్యే భూదందాలు, అవినీతి దందాలు సైతం ప్రజలకు తెలియపరుస్తూ చైతన్యపరస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో జోగురామన్నకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిందేనని, అప్పుడే ఆదిలాబాద్ అభివృద్ధి బాటపడుతుందన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆదిలాబాద్ కు ఏం చేశారని జోగురామన్నను ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఓట్ల కోసం వస్తే తిరగబడాలని ప్రజలకు కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. గతంలో పేదలకు ఇళ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేస్తున్నారు.









