AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఊమెన్ చాందీ భౌతికకాయం వద్ద సోనియాగాంధీ నివాళి

బెంగళూరు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కన్నుమూశారు. ఊమెన్‌ చాందీ భౌతిక కాయం వద్ద కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. ఊమెన్‌ చాందీ మృతి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన గౌరవప్రదమైన, అంకితభావంగల నాయకుడని నివాళులర్పించారు. ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారన్నారు. విపక్షాలకు చెందిన వివిధ పార్టీల నేతలు ఊమెన్‌ చాందీకి శ్రద్ధాంజలి ఘటించారు.

ANN TOP 10