AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐదేసిన అశ్విన్, జత కలిసిన జడ్డూ.. తొలిరోజు భారత్‌దే పైచేయి

వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త జ‌ట్టు భారీ స్కోర్ దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్(57), రోహిత్ శ‌ర్మ‌(53) అర్ధ శ‌త‌కాలు బాదారు. తొలి టెస్టు ఆడుతున్న య‌శ‌స్వీ అంచ‌నాల‌ను అందుకుంటూ హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. డ్రింక్స్ బ్రేక్ త‌ర్వాత రోహిత్ సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వీళ్లిద్ద‌రూ ధాటిగా ఆడ‌డంతో భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా 121 ప‌రుగులు చేసింది.

ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 29 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న వెస్టిండీస్ 150 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన విష‌యం తెలిసిందే. సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ 5 వికెట్ల‌, ర‌వీంద్ర జ‌డేజా 3 వికెట్ల‌తో విండీస్‌ను దెబ్బ‌కొట్టారు. ఆ త‌ర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ వికెట్ కోల్పోకుండా 80 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (30), యశస్వి జైస్వాల్ (40) ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు. ఓవ‌ర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు క్రీజులోకి వ‌చ్చిన వీళ్లిద్ద‌రూ అర్ధ శ‌త‌కాలు సాధించారు.

ANN TOP 10