పసిడి ప్రియులకు నిజంగా ఇది బిగ్ షాకే.. పసిడి రేటు రెండు రోజులుగా పెరుగుతూనే వస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు పెరిగితే.. వెండి (Silver) ధర మరింత పైకి ఎగసింది. భారీగా దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. జూలై 13న గోల్డ్ రేటు రూ.380 మేర పెరిగింది. దీంతో పసిడి రేటు పది గ్రాములకు రూ. 60 వేలకు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు కూడా పైపైకి ఎగసింది. ఈ బంగారం ధర రూ. 350 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 55 వేలకు చేరింది. బంగార ధర నిన్న కూడా రూ. 200కు పైగా పెరిగింది. అంటే పసిడి రేటు రెండు రోజుల వ్యవధిలో దాదాపు రూ.600 పరుగులు పెటట్దని చెప్పుకోవచ్చు.
ఒకే రోజులో వెండి రేటు ఏకంగా రూ. 2500 పైకి చేరింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ. 79,500కు పెరిగింది. వెండి కొనే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బంగారం వెండి ధరలు క్రమంగా పైకి చేరుతున్నాయని చెప్పుకోవచ్చు. అందువల్ల గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం.









