AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజేంద్రనగర్‌లో విద్యార్థి మిస్సింగ్ కలకలం…

నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో 12 సంవత్సరాల విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతోంది. రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి రాలేదు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికిన లాభం లేకుండా పోయింది. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో విద్యార్థి తల్లి రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థి కోసం రాత్రంగా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10