AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం, కేటీఆర్‌ దిష్టిబొమ్మల దహనం

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మండిపాటు
పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నాయకులు వక్రీకరించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలుచోట్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ముట్టడించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీటీమ్‌ అని అన్నారు. ఉచిత విద్యుత్‌ విషయంలో రేవంత్‌ వ్యాఖ్యలను వక్రీకరించి బీఆర్‌ఎస్‌ రాజకీయ లబ్దికి యత్నిస్తుందని వారు మండిపడ్డారు.

ANN TOP 10