AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌ను గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించిన జోగురామన్న
రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాసరెడ్డి
బేల మండలంలో విస్తృత పర్యటన

ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని పార్టీ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. గడపగడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు కంది శ్రీనన్న నినాదంతో కంది శ్రీనివాస్ రెడ్డి బేల మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండ‌లంలోని షాహెజ్ తండాలో ఆయ‌న‌కు నాయ‌కులు కార్యకర్తలు, ప్రజలు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు తిరిగి కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటికీ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా గ్రామ‌స్తులు భారీ సంఖ్యలో ఆయ‌న స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అనంతరం కందిశ్రీనివసరెడ్డి మాట్లాడుతూ ఆదివాసీల గోడును ఎమ్మెల్యే జోగురామ‌న్న ప‌ట్టించుకోవ‌డంలేద‌న్నారు. ఎంత మందికి పోడుభూముల‌కు ప‌ట్టాలిచ్చార‌ని ప్రశ్నించారు. ఎంత మందికి ఇళ్లు కట్టించాడ‌ని అడిగారు. మూడెక‌రాలకు గాను 20 గుంటలు 12 గుంట‌ల భూమి మాత్రమే ప‌ట్టాలిచ్చి అమాయ‌క గిరిజ‌నుల‌ను మోసం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆదిలాబాద్‌కు పట్టిన శనిగ్రహాలు జోగురామన్న, పాయల్ శంకర్ అని. వారికి ఓటేస్తే అవి మురుగు కాలువ‌లో ప‌డ్డట్టేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రెండు లక్షల రూపాయ‌ల రుణ‌మాఫీ, తాతా అవ్వలకు నాలుగు వేల చొప్పున పెన్షన్‌, భూమి లేని వ్యక్తి చ‌నిపోతే ఐదు ల‌క్షల బీమా, భూ య‌జ‌మానికి, మునాఫా రైతులకు కూడా రైతు బంధు , ఉపాధి కూలీలకు నెలకు వెయ్యిరూపాయలు ఇస్తుందని అన్నారు.

నిరుద్యోగ యువ‌త‌కు భృతి, రూ.500 ల‌కే గ్యాస్ సిలిండ‌ర్, ఇల్లుక‌ట్టుకోవ‌డానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తుంద‌న్నారు. అందుకే అభివృద్ధి కోరుకునేవారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. రానున్న ఎన్నిక‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామ‌న్నారు. కార్యక్రమంలో గీమ్మ సంతోష్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ షకీల్, కాంగ్రెస్ పార్టీ బేలా మండలం అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్, మాజీ ఎంపీపీ బాపూరావు హుల్కె, మండల ఎస్టీ సెల్ చైర్మన్ మాడవి చంద్రకాంత్, మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, శంకర్ భోక్రె నాగర్కర్ శంకర్, అల్లూరి అశోక్ రెడ్డి, రాజ్ మొహమ్మద్ మండలం మాజీ కోఆప్షన్ మెంబెర్, వాసీమ్ రంజాని, షేక్ సలీం, ప్రవీణ్, ప్రకాష్, ఫీర్దోస్ ఖాన్, సుదర్శన్ రెడ్డి, భోజరెడ్డి సంతోష్ రెడ్డి, కిష్టారెడ్డి, సంజీవ్, ఎల్మారామ్ రెడ్డి, గేడం అశోక్, మానే శంకర్, ఓసావర్ సురేష్,పోచ్చన్న, పోతారాజు సంతోష్, షేక్ షాహిద్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్, రాజ్‌కుమార్, లాస్మా రెడ్డి, లింగన్న త‌దిత‌రులు పాల్గొన్నారు.

ANN TOP 10