AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎవరి దారి వారిదే.. ఇడుపులపాయకు విడివిడిగా వెళ్లనున్న జగన్‌, షర్మిల

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌, వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల మధ్య విభేదాలు మరోసారి బహిర్గత మయ్యాయి. శనివారం (8వ తేదీ) ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించే కార్యక్రమంలో అన్న సీఎం జగన్, సోదరి షర్మిల విడి విడిగా కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతంలో ఇద్దరూ కలిసి నివాళులర్పించినా ముభావంగా కనిపించేవారు. అయితే ఈసారి మాత్రం వేర్వేరు సమయాల్లో తండ్రి సమాధి దగ్గరకు వెళుతున్నారు. శుక్రవారం రాత్రి షర్మిల తన తల్లి విజయలక్ష్మితో కలిసి ఇడుపులపాయ చేరుకోనున్నారు. శనివారం ఉదయం వైఎస్‌కు నివాళులర్పించి హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరనున్నారు.

కాగా షర్మిల రాకతో జగన్ తన షెడ్యూల్ మార్చుకున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది ముందుగానే వైఎస్ ఘాట్‌కు చేరుకునే జగన్.. ఈసారి మాత్రం శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఇడుపులపాయకు రానున్నారు. అనంతపురం జిల్లా, కల్యాణదుర్గం పర్యటన ముగించుకుని ఇడుపులపాయ వెళ్లి వైఎస్‌కు నివాళులర్పించనున్నారు. మరోవైపు వైఎస్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి ఇడుపులపాయలో నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. జగన్, షర్మిల మధ్య గత విభేదాలు ఉన్నప్పటికీ గతేడాది నుంచి ఇద్దరూ తన తల్లితో కలిసి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా జగన్ ఉదయాన్నే వైఎస్ ఘాట్‌కు వచ్చేవారు. అయితే ఈసారి షర్మిలతో విబేధాల కారణంగా ఆనవాయితీకి జగన్ ఫుల్‌స్టాప్ పెట్టినట్లు కనిపిస్తోంది. రాజకీయంగా ఇద్దరి దారులు వేరైనందువల్లే జగన్ ఈసారి షర్మిల వెళ్లిపోయిన తర్వాతే ఇడుపులపాయ వస్తున్నారు.

ANN TOP 10