దట్టమైన అడవీ ప్రాంతం.. చిమ్మచీకటి.. ఎవరులేరు.. తండ్రి కదలకుండా పడిపోయాడు.. దీంతో ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితి.. అలాగే తండ్రి మృతదేహం పక్కనే రాత్రంతా జాగారం చేశారు. అంతేకాదు చిమ్మచీకట్లలో వింత శబ్దాల అరుపులు వినిపిస్తున్నా.. బయపడకుండా తండ్రి శవం వద్దే మూడేళ్లబాబు ఏడుస్తూ పడుకున్నాడు. అటవీ ప్రాంతంలో రాత్రి అంతా పది గంటల పాటు మూడేళ్ల కొడుకు తండ్రి శవంతోనే.. తలు చుకుంటేనే భయమేస్తుంది.. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా లోఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్ కు చెందిన మాలవత్ రెడ్డి (34) గత జూన్ నెల 21న తన మేనమామ చంద్రును యాచారంలో దింపేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లాడు.
తన కొడుకు నితిన్ (3)తో కలిసి చంద్రును యాచారంలో దింపి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మాలవత్ రెడ్డి బైక్అజాగ్రత్తగా నడపడంతో దగ్గి అటవీ ప్రాంతంలో సుమారు రాత్రి 8 గంటల సమయంలో దర్గా వద్ద బారికేడికి ఢీ కొట్టి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన మాలవత్ రెడ్డి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. కొడుకు నితిన్ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు.
దీంతో చిమ్మచీకటిలో వారిని ఎవరూ గమనించకపోవడంతో ప్రమాద సమాచారం ఎవరికీ తెలియలేదు. ఇంటి నుంచి మాలవత్ రెడ్డికి ఫోన్లు వస్తున్నాయి. అయితే నితిన్ వాటిని లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేని వయస్సు. దీంతో ఆ పసిబాలుడు నితిన్ తండ్రి మృతదేహం వద్దే ఏడుస్తూ ఉందిపోయాడు. ఉదయం ఆరు గంటల వరకు ఎవరు రాలేదు. ఉదయం అక్కడ ఉన్న ఓ ఆలయ పూజారి రోడ్డు దాటుతుండగా నితిన్ ని గమనించి అక్కడకు వెళ్లగా మాలవత్ రెడ్డి మృతి చెంది ఉన్నాడు. నితిన్ ఏడుస్తూ కనపించాడు.
ఇంటినుంచి ఫోన్లు వస్తుండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు,పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థానికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితేఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇందల్వాయి పర్యటనలో భాగంగా ఈ విషయం తెలిసి రెడ్డి కుటుంబాన్ని పరమర్శించారు.









