ప్రధాని మోడీకి కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పిన తర్వాతే వరంగల్ కు రావాలి అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మరో పదిరోజుల్లో నరేంద్ర మోడీ వరంగల్ కు వస్తున్నారు.. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరుపున అడుగుతున్నానని ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతాం అన్నారు.. ఎందుకు ఉక్కు పరిశ్రమ పెట్టడం లేదు.. వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడుతాం అని మాట తప్పారన్నారు. రైళ్లు తయారీ కేంద్రం పెడతామని చెప్పి ఇప్పుడు మెకానిక్ ఫాక్టరీ పెడతా అంటున్నారు అని కేటీఆర్ విమర్శించారు. వీటన్నింటిపై మాట తప్పినందుకు మోదీ క్షమాపణ చెప్పి రావాలన్నారు.









