AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జననేత ఎంజీఆర్ .. బస్తీల్లో టూర్

ఆలయాల్లో పూజలు
బస్తీల్లో పర్యటనలు
సమస్యలపై ఆరా.. స్థానికులకు భరోసా
కార్యకర్తలతో కలిసి.. కదిలిన నాయకుడు

(మన ఖైరతాబాద్ ప్రతినిధి)
జననేత, నిత్యం ఖైరతాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండే ఎంజీఆర్.. ఓవైపు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ, మరోవైపు కార్యకర్తలతో కలిపి బస్తీల్లో పర్యటిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలకు ఓదార్పునిస్తున్నారు. భరోసాగా నిలుస్తున్నారు. ఖైరతాబాద్ డివిజన్ గాంధీ తాత నగర్ నల్లపోచమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్దన్ రెడ్డి.. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్తీలో పర్యటించారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ.. సమకాలీన అంశాలపై చర్చించారు. ఆలయ అర్చకులు ఎంజీఆర్కు శాలువా కప్పి సన్మానించారు.

ఆస్పత్రిలో పరామర్శ
వెంకటేశ్వర కాలనీ డివిజన్ శౌకత్నగర్కు చెందిన భీమమ్మ ప్రమాదవశాత్తు డాబాపై నుంచి జారిపడింది. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఆమెను ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ మన్నె గోవర్దన్ రెడ్డి పరామర్శించారు. వైద్య బృందంతో మాట్లాడి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు.

అండగా ఉంటా
వెంకటేశ్వర కాలనీ డివిజన్ ప్రతాప్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త ముఖేశ్ గుండెపోటుతో అకాల మరణం చెందాడు. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి.. వెంటనే ముఖేశ్ ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి నివాళి అర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ANN TOP 10