చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. బుధవారం రాత్రి 15మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు గురువారం ప్రజాకోర్టు నిర్వహించి అందులో ఇద్దర్ని చంపేశారు. నక్సలైట్ల చేతిలో చనిపోయిన వారిలో బుర్కాపాల్ గ్రామ ఉపసర్పంచ్ మాడ్వి గంగాతో పాటు టీచర్ సుక్కాగా గుర్తించారు. వీరితో పాటు మావోయిస్టులు ఎత్తుకెళ్లిన మరో 13మంది ఇంకా వారి చెరలోనే ఉన్నారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లనే నెపంతో ఇద్దర్ని చంపేసినట్లుగా ప్రకటించారు. అయితే గ్రామ ఉపసర్పంచ్ గంగాను ప్రాణాలతో విడిచిపెట్టాలని అధికారులు మావోయిస్టులతో పాటు పోలీసులకు లేఖ రాసినప్పటికి ఊపేక్షించలేదు.
ఇద్దర్ని చంపిన నక్సలైట్లు..
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. చత్తీస్‌గడ్ సుక్మా జిల్లాలోని బుర్కపాల్ పంచాయతీ ఉప సర్పంచ్ మాద్వి గంగ అనే మహిళతో పాటు టీచర్ సుక్కాతో పాటు మరో 13మందిని బుధవారం రాత్రి తాడిమెట్లలోని ఇంటి నుంచి తీసుకెళ్లారు. పోలీస్ ఇన్ఫార్మర్లు అనే నెపంతో ఉపసర్పంచ్‌తో పాటు టీచర్ సుక్కాను ప్రజాకోర్టు నిర్వహించి చంపేశారు. మావోయిస్టులు మొత్తం 15మందిని ఎత్తుకెళ్లగా వారిలో ఇద్దర్ని చంపారు.మరో 13మంది మావోయిస్టుల చేతిలో బంధీగా ఉన్నారు.
మావోల చెరలో మరో 13మంది..
మావోయిస్టులు గ్రామ ఉపసర్పంచ్ మద్వి గంగను విడిచిపెట్టాలని గ్రామస్తులు మావోయిస్టులకు, పోలీసులకు లేఖలు రాశారు. ఎలాంటి ప్రాణహాని తలపెట్టవద్దని ఆందోళనలు చేశారు. మావోయిస్టుల చేతిలో బంధీగా ఉన్న వారిని విడిపించేందుకు ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగినప్పటికి నక్సలైట్లు మాత్రం గురువారం ఉదయం ప్రజాకోర్టు నిర్వహించి ఇద్దర్ని హతమార్చారు.









