విశాఖలో మరో రియాల్టర్ కుటుంబం కిడ్నాప్ కలకలంరేపుతోంది. రియల్టర్ శ్రీనివాస్‌తో పాటుగా అతడి భార్య లోవ లక్ష్మిని కిడ్నాప్ చేశారు దుండగులు. విశాఖలో 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల కిడ్నాప్ ఘటన జరిగింది. ఏడుగురు దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. శ్రీనివాస్ దంపతులు విజయవాడ నుంచి విశాఖ కి కొద్ది రోజుల క్రితం వ్యాపారం నిమిత్తం వచ్చారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీ చరణ్ రియాల్టర్ సంస్థపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
2021 జూన్‌లో విజయవాడలో రియల్టర్ శ్రీనివాస్‌ని చీటింగ్ కేసులో పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3 కోట్లను శ్రీనివాస్ కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. అందులో 60 లక్షల రూపాయల ఇవ్వాలని కిడ్నాప్ చేసిన దుండగులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ కిడ్నాప్ ఎపిసోడ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండు వారాల క్రితం విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీ కిడ్నాప్ ఘటన కలకలంరేపింది. మరోసారి రియల్టర్ కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది.. వరుస కిడ్నాప్ ఘటనలు కలకలంరేపుతున్నాయి.









