AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముస్లిం సోదరులకు కంది శ్రీనన్న ఈద్‌ ముబారక్‌


ఆదిలాబాద్‌ : జిల్లా వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్‌ పండగను ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆదిలాబాద్‌ పట్టణంలోని ఈద్గా మైదానానికి లో భారీ సంఖ్యలో చేరుకున్న ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గావద్ద ప్రార్థనలు ముగిసిన అనంతరం కాంగ్రెస్‌ రాష్ట్రనాయకులు కంది శ్రీనివాస రెడ్డి డీసీసీ అధ్యక్షడు సాజిద్‌ ఖాన్, జిల్లా మైనారిటీ సెల్‌ చైర్మన్‌ ఎం. ఏ.షకీల్, పలువురు ముస్లిం సోదరులను కలిసి ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లింలందరూ ఆనందోత్సహాల మధ్య పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, రహీమ్‌ ఖాన్, ముఖిమ్, షేక్‌ రహీమ్, ఆఫ్సార్, ఆస్బాత్‌ ఖాన్, గిమ్మ సంతోష్, నాగర్కర్‌ శంకర్, గేడం అశోక్, దీపక్‌ రావు, ఆడే విట్టల్, ప్రభాకర్‌ రావు, మనే శంకర్, ఎల్టీ సన్నీ రెడ్డి, రవి, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10