తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ వేర్ హౌజ్ కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో అర్ధరాత్రి మృతి చెందారు. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి సాయిచంద్ వచ్చారు. అర్ధరాత్రి అస్వస్థకు గురైన సాయిచంద్‌ని కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాగర్ కర్నూల్ గాయత్రి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.









