AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి

తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయి మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సాయి మృతితో తెలంగాణ సమాజం గొప్ప గాయకుణ్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అన్నారు. తెలంగాణ సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. సాయిచంద్ లేకుండా తెలంగాణ సాధనలో తన సభలు సాగేవి కావని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని.. నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు.

ANN TOP 10