కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు
ఆదిలాబాద్: కరుణ, త్యాగాలకు బక్రీద్ పండుగ ప్రతీక అని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమాజహితమే బక్రీద్ సందేశం అని అన్నారు. భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు.









