జైనథ్ మండలంలో డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం
ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి సోమవారం జైనథ్ మండలంలో పర్యటిస్తున్నారు. బాలాపూర్‌లో గడప గడపకు కాంగ్రెస్ – పల్లె పల్లెకు కంది శ్రీనన్న కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు,కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డిని డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గడప గడపకి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలు గురించి కరపత్రాలతో ప్రజలకు వివరించారు.∙బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అన్యాయాలను గురించి ప్రజలకు తెలిపారు.
లక్ష రూపాయల రుణమాఫీ, రైతు బంధు, పొడుభూములకి పట్టాలు, పింఛన్లు, డబల్ బెడ్రూం లు ఏ ఒక్క సంక్షేమ పథకలు అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ,15 వేల రైతు బంధు,రైతు భీమా,పొడుభూములకు పట్టాలు, స్కాలర్షిప్ లు, రేషన్ కార్డులు, 5 వేల రూపాయల పింఛన్లు, నిరుద్యోగ భృతి,ఇల్లులు కట్టిస్తదని, 18 సంవత్సరాలు నిండిన అడ బిడ్డకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తుంది అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి అని తెలిపారు.









