టాలీవుడ్ నిర్మాత కె.పి.చౌదరిని పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో 12 మంది సినీ, రాజకీయ ప్రముఖులు వారి సంబంధీకులు ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు బయటకువ వచ్చాయి. సినీ రంగం నుంచి సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి (Ashu Reddy), నటి జ్యోతి, నటి సురేఖా వాణి (Surekha Vani) పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా కె.పి.చౌదరితో ఫోన్లో మాట్లాడిన వ్యవహారంపై సినీ నటి జ్యోతి రియాక్ట్ అయ్యారు. ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆమె నిర్మాత కె.పి.చౌదరితో తనకు స్నేహం తప్ప డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని నొక్కి చెబుతున్నారు.
‘‘నాకు, కె.పి.చౌదరి మంచి స్నేహితుడు. ఆయన సిటీకి వచ్చినప్పుడు కొడుకుని కానీ లేదా ఆయన పెంపుడు కుక్కను కానీ ఇక్కడకు తీసుకొచ్చి వదిలేసి వెళతారు. వాళ్ల కొడుకుతో మా కొడుకు ఆడుకుంటాడు. అంతే తప్ప బయట న్యూస్‌లో వచ్చినట్లు నాకు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం. అవసరం అయితే నార్కోటిక్ టెస్ట్‌కు కూడా సిద్ధమే. నేను వందల కాల్స్ చేశానని అంటున్నారు. అందులో వాళ్ల ఫ్యామిలీ బాగోగులు గురించి అడిగానే తప్ప.. వేరే మాటలు ఏం మాట్లాడలేదు.
అలాగే నేను నా ఫోన్ నుంచి ఎలాంటి డేటాను డిలీట్ చేయలేదు. ఒకవేల డిలీట్ చేసుంటే రిట్రీవ్ చేసుకుంటారు కదా.. అలాగైనా చేసుకోవచ్చు. నేను నా రెండు ఫోన్స్ పోలీసులకు ఇచ్చేస్తాను. వారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా. నేను అందుకు పూర్తిగా సహకరిస్తాను అని జ్యోతి చెబుతున్నారు.