AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గంప గోవర్ధన్, షబ్బీర్ అలీ మధ్య మాటల యుద్ధం..

ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యే మరొకరు మజీ మంత్రి.. ఇద్దరి మధ్య దశాబ్ద కాలంగా పొలిటికల్ వార్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడం మామూలే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ నేతలు ఇద్దరూ తమ విమర్శలకు మరింత పదును పెట్టారు. తాజాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో మరోసారి వీరి మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ, ప్ర‌భుత్వ విఫ్ బీఆర్ఎస్ ఎమ్మేల్యే గంప గోవ‌ర్థ‌న్ మ‌ద్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే బ‌గ్గు మంటోంది.

తాజాగా కామారెడ్డి జిల్లాలో డ‌బుల్ ఇంళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించింది.. ఎప్పుడు కూలిపోతాయో తెలియదంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలి ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎదురుదాడికి దిగడంతో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన ఇళ్లు 50 ఏళ్లయినా కూలిపోవన్నారు. కావాలంటే ఇంజనీర్లను తీసుకొచ్చి ఇళ్లను పరిశీలిద్దామంటూ సవాల్ విసిరారు.
తాజాగా గంప సవాల్ను షబ్బీర్ అలీ స్వీకరించారు. తన అనుచరులతో టేక్రియాల వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లవద్దకు వెళ్లి.. నాణ్యత లేదంటూ ఆరోపించారు. ఇంజనీర్లను తీసుకొస్తానని సవాల్ విసిరిన ఎమ్మెల్యే కనపడకుండా పోయారంటూ ఫైర్ అయ్యారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఆందోళ‌న‌ చేశారు. నాణ్యత లేని ఇళ్లు కూల్చి మళ్లీ నిర్మించాలని డిమాండ్ చేశారు.

షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ఇంజనీర్లకు తెలుస్తుంది కానీ.. గల్లీ మేస్త్రీలకు తెలియదన్నారు. ప్రభుత్వ మంత్రిగా పనిచేసిన షబ్బీర్ అలీకి ఆమాత్రం తెలియదా అని ప్రశ్నించారు. సవాల్ విసిరిన తర్వాత సమయం ఇవ్వాలన్నారు. అలా కాకుండా నోటికోచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు.

ANN TOP 10