AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాలు అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలున్నాయని చెప్పింది. ఆదివారం, రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదిలాఉంటే.. ఏపీలో సైతం వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కోస్తాంధ్రకు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు.

ANN TOP 10