పుతిన్ పై వాగ్నర్ వార్..
సైనిక నాయకత్వాన్ని కూల్చేస్తామని గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ ప్రకటన
ఏడాదిగా ఉక్రెయిన్‌పై సైనిక దాడులకు పాల్పడుతున్న రష్యాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధ భూమిలో ఇప్పటివరకు ఆశించిన ఫలితాలు లభించని పుతిన్ ప్రభుత్వానికి ఈ పిడుగులాంటి వార్త ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో ఇంత కాలం రష్యాకు అండగా ఉండిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసింది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రతిన బూనింది. ఈ క్రమంలో తమ దారికి అడ్డువచ్చే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. కాగా వాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్ దేశ ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపించిన పుతిన్ రష్యాను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామని ప్రకటించారు.
ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో పుతిన్ శనివారం దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ హెచ్చరిక చేశారు. తిరుగుబాటుకు సిద్ధమైన వారంతా కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. అయితే తాము దేశ భక్తులమని ప్రిగోజిన్ చెప్పుకోవడం గమనార్హం.ఉక్రెయిన్‌లో తమకు ఎదురవుతున్న సవాళ్లపై వాగ్నర్ సేన అధిపతి ప్రిగోజిన్ కొంతకాలంగా ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయన అక్కడి రక్షణ శాఖపై తీవ్ర అసహనంతో ఉన్నారు.ఈ క్రమంలో రష్యా సైనికనాయకత్వాన్ని కూలదోస్తామంటూ ఆయన తీవ్ర హెచ్చరిక కూడా చేశారు. దానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఇప్పుడు రష్యా ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.‘ మా దళాలు ఇప్పుడు రష్యా దక్షిణ ప్రాంతమైన రోస్తోవ్‌లోకి ప్రవేశించాయి.









