AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నగరంలో భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీలు

నగరంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. కుండపోత వర్షంతో గ్రేటర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మన్సురాబాద్‌లోని కాలనీలు నీట మునిగాయి. అధికారుల నిర్లక్ష్యంతో చిన్న వర్షానికే కాలనీలు జలమయం అయ్యాయి. ఒక భూ యజమానికి లబ్ధి చేకూర్చడం కోసం కాలనీల ద్వారా బాక్స్ డ్రైన్ నిర్మాణం చేశారని, రాత్రి కురిసిన వర్షానికి… స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు. రాబోయే భారీ వర్షాలకు 150 ఇళ్ళల్లో ఉన్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని స్థానికులు చెబుతున్నారు.

యూసూఫ్‌గూడ, కృష్ణానగర్‌, వెంగళ్‌రావునగర్‌, బేగంపేట, ఎంఎస్‌మక్తా, ఫిలింనగర్‌ లోతట్టు ప్రాంతాల్లో రహదారులను వర్షంనీరు ముంచేసింది. ఖైరతాబాద్‌లో చెట్టు కొమ్మ విరిగి పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారులపై మోకాలి లోతున నీరు నిలిచిపోవడంతో సికింద్రాబాద్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, జేఎన్‌టీయూ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీవర్షంతో రాజేంద్రనగర్‌, బోరబండ, చార్మినార్‌తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై వరదనీరు నిలిచిపోకుండా విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.

ANN TOP 10