AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షాద్‌నగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటన షాద్‌నగర్‌ పురపాలిక పరిధిలోని సోలిపూర్ గ్రామ శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

మృతులు, క్షతగాత్రులను వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్(28), శంకర్(32), రవి(30)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం అతివేగమా లేక నిద్ర మత్తులో జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

ANN TOP 10