AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భట్టి విక్రమార్కకు షర్మిల ఫోన్.. విలీనానికి సంకేతాలిచ్చినట్టేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిర పరిణామం
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు నేతలంతా ఏకతాటిపైకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. అయితే.. ఇదే క్రమంలో కేసీఆర్‌ పేరు చెప్పినా.. బీఆర్ఎస్‌ పార్టీ ప్రసక్తి తెచ్చినా.. ఆగ్రహంతో ఊగిపోయే వైఎస్సార్ పార్టీ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల.. అనూహ్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. అయితే.. ఇప్పటికే.. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్టు వార్తలు ఊపందుకున్న సందర్భంలో.. భట్టి విక్రమార్కకు షర్మిల ఫోన్ చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే.. పీపుల్స్ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆయన అనారోగ్యానికి గురికాగా.. ఫోన్‌ చేసి షర్మిల పరామర్శించారు. భట్టికి ఫోన్ చేసిన షర్మిల.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కాగా.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుండగా.. ఇప్పుడు షర్మిల వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. ఇదే కాకుండా.. ఇటీవల రాహుల్ గాంధీ బర్త్ డే‌కు కూడా షర్మిల తన ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. అంతకుముందు కర్ణాటక లీడర్ డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇదే కాకుండా.. ఈ పీపుల్స్ పాదయాత్రలోనే ఏపీ లీడర్ కేవీపీ రామచంద్రారెడ్డి కూడా భట్టి విక్రమార్కను కలిశారు. ఇవన్నీ కలిసి.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారన్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.

ANN TOP 10