కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్లు ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాయదుర్గానికి చెందిన అలివేలు(40), లాస్య(14) తమ నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









