AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భూములమ్మీ.. గుడులకు పెట్టడమా?

ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అమలు చేస్తున్న కేసీఆర్‌
కవిత అరెస్టు అడ్డుకునేందుకే..
కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాష్ట్ర ఖజానాలో డబ్బుల లేవని భూములు అమ్ముతున్నారని, ఆ వచ్చిన నిధులను సీఎం కేసీఆర్‌ ఇష్టారాజ్యంగా ఖర్చుచేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మండిపడ్డారు. కోర్టులు మొట్టికాయలు పెట్టినా కేసీఆర్‌ మారడం లేదని కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌ రూ.600 కోట్లు ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను కేసీఆర్‌ అమలు పరుస్తున్నారని ఆరోపించారు. కూతురు కవిత అరెస్ట్‌ను తప్పించడానికేనా అని ప్రశ్నించారు. కేసీఆర్‌.. బీజేపీ బీ టీమ్‌ అని మరోసారి నిరూపించుకుంటున్నారన్నారు. అందుకే కేసీఆర్‌, కేటీఆర్‌ అరెస్ట్‌ కావడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ తాను సెక్యులర్‌ అని చెప్పుకుంటూ చర్చిలకు, మసీదులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు.

కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్‌ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సెక్యులర్‌ ప్రజలు ఈ విషయంపై కేసీఆర్‌ను ప్రశ్నించాలన్నారు. డబ్బుల కోసం కమ్యూనిస్టులు కేసీఆర్‌ దగ్గరకే కాదు ఎక్కడికైనా వెళ్తారని అన్నారు. ఏప్రిల్‌ 14న తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ఒప్పుకున్నారు కనుక రేపు తెలంగాణ ప్రజలు కలెక్టరేట్‌లను ముట్టడిరచవద్దని పాల్‌ విజ్ఞప్తి చేశారు. తాను నిజమైన హిందువును అని.. హిందువుగానే చనిపోతాను.. కానీ ఏసుక్రీస్తును ఫాలో అవుతాను అంటూ కేఏపాల్‌ పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10