తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లై దాటి పోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించారు తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు. అది అలా ఉంటే ఈ భామ కొన్నాళ్లుగా ఓ వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు కొన్ని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.
తమన్నా కొన్నాళ్లుగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించగా.. అవి నిజమేనని తెలిపింది ఈ అమ్మడు. తమన్నా తోటి నటుడు విజయ్ వర్మ(Vijay Vama)ను ప్రేమిస్తున్నట్లు.. అతను అంటే ఎంతో ఇష్టమని.. పేర్కోంది. అంతేకాదు ఈ జంట అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. దీంతో అసలు ఈ విజయ్ వర్మ ఎవరు అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. విజయ్ వర్మ తెలంగాణకు చెందిన వ్యక్తే అని తెలుసుకుని షాక్ అవుతున్నారు. విజయ్ వర్మ 1986 మార్చ్ 29న హైదరాబాద్‌లో జన్మించారు.
విజయ్ తండ్రి హ్యాండీ క్రాఫ్ట్ బిజినెస్ చేసేవారట. ఇక సినిమాల మీద మక్కువతో ఆయన ముంబై వెళ్లి అక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టి నటుడిగా సక్సెస్ అయ్యారు. విజయ్ వర్మ తెలుగులో కూడా నటించారు. ముఖ్యంగా ఆయన నాని హీరోగా వచ్చిన MCAలో విలన్‌గా వావ్ అనిపించారు. హిందీలో విజయ్ వర్మ పలు హిట్ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు.