ఓ రోగి కిడ్నీలోని రాయి ఏకంగా రెండు ప్రపంచ రికార్డులను బద్దలుగొట్టింది. అది 801 గ్రాముల బరువు ఉండడమే కాకుండా 13.37 సెంటీమీటర్ల పొడవు ఉంది. శ్రీలంక రాజధాని కొలంబోలోని సైనిక ఆసుపత్రిలో ఈ నెల 1న ఓ రోగికి ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి మూత్రపిండాల నుంచి అతిపెద్ద రాయిని బయటకు తీశారు. 2004లో భారతదేశంలో 13 సెంటీమీటర్ల పొడవున్న రాయిని కిడ్నీ నుంచి బయటకు తీయగా, 2008లో పాకిస్థాన్‌లో 620 గ్రాముల బరువున్న రాయిని బయటకు తీశారు. ఇటీవల శ్రీలంకలో వెలికి తీసిన రాయి అటు బరువులోను, ఇటు పొడవులోనూ ఆ రెండింటి రికార్డును బద్దలుగొట్టి ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్‌గా సరికొత్త రికార్డులు సృష్టించింది.