తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆలయానికి దగ్గర్లోనే ఉన్న ఫొటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అవి షాపు మొత్తం వ్యాపించాయి. వెంటనే స్థానికులు… అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటే అని భావిస్తున్నారు. ఐతే.. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఫొటో ఫ్రేమ్ షాపులో వారు అక్కడి నుంచి తప్పించుకున్నారా లేదా అన్నది తెలియట్లేదు. మంటలు ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా కనిపించట్లేదు. మంటలు చాలా వేగంగా ఇతర షాపులకు వ్యాపిస్తున్నాయి. అక్కడ గాలి బాగా వస్తుండటంతో… మంటలు వేగంగా ఎగసిపడుతున్నాయి. మంటలు గోవిందరాజు స్వామి ఆలయ రథ మండపానికి వ్యాపిస్తున్నాయి. గంటన్నర నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. అందువల్ల లావణ్య ఫొటో ప్రేమ్ షాపు పూర్తిగా తగలబడింది. ఈ షాపుకి మొత్తం 4 అంతస్థులు ఉన్నాయి. అన్నీ కాలిపోయాయి.
ఫొటో ఫ్రేములన్నీ కలపతో చేసేవి కావడం వల్లే మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి అని అంటున్నారు. ప్రస్తుతానికి మంటలు వస్తున్న వైపుగా ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ట్రాఫిక్ సమస్యలు రాకుండా, అటుగా ఎవరూ వెళ్లకుండా ప్రయత్నిస్తున్నారు.