AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం..

త్వరలోనే చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లికాబోతుండడంతో వారసుడి కోసం మెగా ఫ్యామిలీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 14న చరణ్, ఉపాసన పెళ్లి రోజు. వీరి వివాహం జరిగి ఇప్పటివరకు 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు.

తాజాగా షేర్ చేసిన వీడియోలో స్టెమ్ సైట్ ఇండియాను ఎంచుకున్నానని.. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏంటో చెప్పుకొచ్చింది. స్టెమ్ సైట్ ఇండియాలో.. పుట్టబోయే బిడ్డకు సంబంధించిన కోర్డ్ బ్లడ్‏ను దాచుకుంటున్నట్లు తెలిపింది. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ లో పుట్టిన బిడ్డకు సంబంధించిన బొడ్డు తాడును దాచుకోవడం వలన పెద్దయ్యాక వారికేమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు బొడ్డు తాడును ఉపయోగిస్తారని తెలిపింది.

మెగా కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. అపోలో మేనేజింగ్ డైరెక్టర్స్‏లలో ఒకరిగా కొనసాగుతున్న ఉపాసన.. ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. అంతేకాకుండా.. చెర్రీతో కలిసి సినిమా ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. అంతేకాకుండా.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటారు. కేవలం ఫ్యామిలీ విషయాలే కాకుండా.. ప్రజలకు అవసరమైన అంశాలు.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సైతం నెట్టింట షేర్ చేస్తుంటారు.

ANN TOP 10