AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీట్‌లో తెలుగు వారికి ర్యాంకుల పంట

దేశంలో వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యుజి 2023 ఫలితాలలో ఇద్దరు విద్యార్థులు తొలి ర్యాంక్ సాధించారు. తమిళనాడుకు చెందిన ప్రబంజన్ జే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బొరా వరుణ్ చక్రవర్తి 99.99 పర్సంటైల్ స్కోర్‌తో మొదటి ర్యాంకు వచ్చింది. 720కి 720 మార్కులు సాధించిన మార్కులు వచ్చిన ఇద్దరికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఒకే ర్యాంకు ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న నీట్ యుజి 2023 ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. తెలంగాణలో కాంచనీ గేయంత్ రఘురామ్ రెడ్డికి అఖిల భారత స్థాయిలో 15వ ర్యాంక్, జాగృతి బొడెద్దులుకు 49వ ర్యాంక్ లభించింది. తెలంగాణలో 42,654 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎపి విద్యార్థి బొరా వరుణ్ చక్రవర్తి.. ఒబిసి కేటగిరీలోనూ ఫస్ట్ ర్యాంక్ పొందారు. ఇడబ్లూఎస్ కేటగిరీలోనూ ఎపి విద్యార్థి ప్రవధాన్ రెడ్డి తొలి ర్యాంక్ సాధించారు. ఎస్‌సి కేటగిరీలో కె.యశశ్రీ రెండో ర్యాంకు పొందారు. కాగా, ఎపిలో 42,836 మంది విద్యార్థులు అర్హత పొందారు. మొత్తం 20.38 లక్షల మంది విద్యార్థులు నీట్ యుజి పరీక్ష రాయగా,అందులో 11.45,968 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా 1.39 లక్షల మంది అర్హత సాధించగా, తర్వాతీ జాబితాలో మహారాష్ట్ర 1.31 లక్షలు, రాజస్థాన్ లక్ష దాటారు.

ANN TOP 10