AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైలు పట్టాలపై పెద్ద బండరాయి.. లోకోపైలట్​ చాకచక్యంతో తప్పిన పెనుప్రమాదం

1000 మందిని కాపాడిన​ లోకోపైలట్​
లోకోపైలట్​ చాకచక్యంగా వ్యవహరించి పెను రైలు ప్రమాదాన్ని తప్పించారు. కర్ణాటకలోని బీదర్ నుంచి కలబురగి వెళ్తున్న 07746 నంబర్​ DEMU ప్యాసింజర్ రైలు వెళ్తుండగా.. పట్టాలపై పెద్ద బండరాయి పడింది. దీంతో లోకో పైలట్ అప్రమత్తమై సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. వల్ల దాదాపు వెయ్యి మంది ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు బీదర్ రైల్వేస్టేషన్ నుంచి కలబురగికి బయల్దేరింది DEMU ప్యాసింజర్ రైలు.

కలబురగి జిల్లా కమలాపుర ప్రాంతంలోని మారగుట్టి సమీపంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో రైలు సొరంగంలోకి ప్రవేశించింది. ఆ మార్గంలో వెళ్తుండగా కొండపై నుంచి భారీ బండరాయి జారి ట్రాక్ పక్కన పడింది.రైలు సొరంగంలోకి ప్రవేశించిన తర్వాత.. ట్రాక్​ పక్కన బండ రాయి పడి ఉండటాన్ని లోకో పైలట్ గమనించారు. వెంటనే అప్రమత్తమై రైలును ఆపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలులో ఉన్న 1000 మందికి పైగా ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

బండ రాయి కారణంగా రైలు రెండు గంటలపాటు నిలిచిపోయింది. కొందరు ప్రయాణికులు.. పొలాలు గుండా రెండు మూడు కిలోమీటర్లు నడిచి ప్రధాన రహదారిపైకి వచ్చి బస్సులు, ఆటోలో కలబురగికి వెళ్లారు. అనంతరం రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌పై ఉన్న బండను తొలగించారు. ఆ తర్వాత రైలు బీదర్ నుంచి కలబురగికి వెళ్లింది. అయితే, రైలు కదులుతున్న సమయంలో భూమి కంపించి కొండ చరియలు విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు.

ANN TOP 10