AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నగరంలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్…

నగరంలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మంగళవారం ఉదయం కొండాపూర్, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌లో స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు. యూసఫ్‌గూడలో ఫిట్‌నెస్‌లేని స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యం నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు.

విద్యాసంవత్సరం ప్రారంభంకావడంతో ఇటు స్కూల్‌ బస్సులపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. అందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉదయం నుంచి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. 15 రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.

రాజేంద్రనగర్, కొండాపూర్, శంషాబాద్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయ పరిధిలో డ్రైవ్ కొనసాగుతోంది. మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్సీ, పర్మిట్, ఫిట్‌నెస్‌, ఫైర్ ఎగ్జిట్‌తో పాటు ఫస్ట్ఎయిట్ కిట్‌లను కూడా తనిఖీల చేస్తున్నారు. ఇందులో ఏవి లేకపోయినా వారిపై పెనాల్టీలు వేస్తున్నారు.

ANN TOP 10